69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల పై నుంచి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం పూర్తి పాఠం

69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఎర్రకోట బురుజుల పై నుంచి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం పూర్తి పాఠం
x
Highlights

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 15 ఉదయం సామాన్యమైంది కాదు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యానికి స్వాతంత్ర్యం లభించిన పర్వదినం. 125 కోట్ల మంది భారత ప్రజల కలలకు మహోదయం. 125 కోట్ల మంది ప్రజల ప్రగాఢ ఆకాంక్షలకు, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధింపచేయడం కోసం శతాబ్దాల తరబడి పోరాటం చేసిన ధీర యోధుల త్యాగాలకు దర్పణం.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 15 ఉదయం సామాన్యమైంది కాదు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యానికి స్వాతంత్ర్యం లభించిన పర్వదినం. 125 కోట్ల మంది భారత ప్రజల కలలకు మహోదయం. 125 కోట్ల మంది ప్రజల ప్రగాఢ ఆకాంక్షలకు, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధింపచేయడం కోసం శతాబ్దాల తరబడి పోరాటం చేసిన ధీర యోధుల త్యాగాలకు దర్పణం.


దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి పోరాటం చేసిన యోధులు తమ యవ్వనం అంతటినీ జైళ్ళలోనే గడిపారు. ఎన్నో దురాగతాలకు బాధితులయ్యారు. అయినా, తమ కలలు సాకారం చేసుకొనే విషయంలో ఏ రోజూ రాజీ పడలేదు. తమ స్వాతంత్ర్య కాంక్ష నీరుగారి పోనీయలేదు. నాటి స్వాతంత్ర్య యోధులందరికీ కోట్లాది అభివాదాలు చేస్తున్నా. గత కొన్ని రోజులుగా ఎందరో ఘనత వహించిన పౌరులు, యువకులు, పండితులు, సామాజిక కార్యర్తలు, భరతమాత ముద్దు బిడ్డలైన ఎందరో భారతదేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయడానికి ఎంతో శ్రమించారు. లెక్క చెప్పడానికి వీలు లేనంత మందిగా ఉన్న ఆ మహామహులందరికీ ఈ ఎర్రకోట బురుజులపై నుంచి వందనం చేస్తున్నాను. భారతదేశంలోని భిన్నత్వాన్ని, విశాలదృక్పథాన్ని తరపూ ప్రశంసిస్తూంటుంది. భారతదేశానికి ఎన్నో మంచి లక్షణాలున్నాయి. భిన్నత్వం, విశాలదృక్పథం, నిరాడంబరత, ఐక్యతాభావం దేశంలోని మూలమూల్లో కనిపిస్తూంటాయి.

మన దేశానికి పెద్ద ఆస్తి, బలం కూడా ఇదే. కొన్ని శతాబ్దాలుగా ఈ బలమే మనకు అండగా ఉంటోంది. ప్రతి శకంలోను దీనికి పునరుత్తేజం కల్పించే కృషి కూడా జరుగుతోంది. అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగాను, భవిష్యత్తు కలలను సాకారం చేసుకొనేందుకు వీలుగాను, ఈ విలువలకు ఎప్పటికప్పుడు కొత్త రూపం ఇస్తున్నారు. తరతరాలుగా మనకు అందిన ఈ విలువలను పాటిస్తూనే ఆధునిక కాలానికి అవసరమైన తీర్మానాలు చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. మనలోని ఐక్యత, నిరాడంబరత, సౌభ్రాతృత్వం, సామరస్య భావాలను చెక్కుచెదరకుండా కాపాడుకోవలసిన అవసరం ఉంది. ఐక్యతకు భంగం వాటిల్లినట్లయితే కలలు చెదిరిపోతాయి. కులతత్వ గరళం కావచ్చు, మతవాద ఉన్మాదం కావచ్చు.... సమాజంలో విజృంభించేందుకు అవకాశం ఇవ్వకూడదు. అభివృద్ధి అనే మకరందంతో వాటిని నిర్మూలించుకుంటూ పోవాలి.
ప్రియ సోదర, సోదరీమణులారా!!


టీమ్ ఇండియా మన దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. ఈ అతిపెద్ద టీమ్ ఇండియాలో 125 కోట్ల మంది భారతీయులున్నారు. టీమ్ ఇండియా అంతా కలసి ఒక్కటిగా ముందడుగు వేస్తే జాతి ఎంతో పురోగమిస్తుంది. ప్రభుత్వం ఏ పనులైనా చేస్తున్నదన్నా, ఏ లక్ష్యాలైనా నిర్దేశించుకుంటుందన్నా, ఏ విజయాలు సాధిస్తున్నదన్నా ఈ 125 కోట్ల మంది అందులో భాగస్వాములే. జాతిని ముందుకు నడిపించడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం. జాతి నిర్మాణంలో ఈ 125 కోట్ల మంది భాగస్వామ్యాన్ని మనం కూడగట్టుకుంటున్నాం.

ఈ భాగస్వామ్యంతో ప్రతి క్షణం మనదేశం 125 కోట్ల అడుగులు ముందుకు వేస్తోంది. mygov.in వెబ్సైట్ ద్వారాను, ప్రతిరోజు మాకు అందుతున్న లక్షలాది లేఖల ద్వారాను, ‘మన్కీ బాత్’ పేరిట సాగుతన్న చర్చల ద్వారాను మనం ఈ బలాన్ని కూడగట్టుకొంటున్నాం. ప్రతిరోజూ ప్రభుత్వానికి మారుమూల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సలహాలు, సూచనలు వస్తున్నాయి. ఇదే టీమ్ ఇండియా అసలు బలం.
ప్రియమైన పౌరులారా!!!


ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ పథకాలు అన్నీ దేశంలోని నిరుపేదలకు లాభం చేకూర్చాలన్నదే టీమ్ ఇండియా లక్ష్యం. వ్యవస్థలను, వనరులను, ప్రణాళికలను, పథకాలను పేదల సంక్షేమానికి అనుగుణంగా ఎలా ఉపయోగించగలుగుతున్నామన్న అంశం మీదనే పాలనా యంత్రాంగం పనితీరు ఆధారపడి ఉంటుంది. దేశంలోని ఏ ఒక్క వ్యక్తి పేదరికంలోనే జీవించాలని కోరుకోడు.


సోదర సోదరీమణులారా!! గత ఏడాది ఆగస్టు 15న నేను కొత్తగా ఎన్నికై ఈ ఎర్రకోట బురుజుల నుండి తొలిసారిగా ప్రసంగించినప్పుడు నా భావాలు కొన్ని విశాల దృక్పథంతో మీ ముందుంచాను. టీమ్ ఇండియాలోని ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త విశ్వాసం, సరికొత్త శక్తి, తమ కలలు సాకారమవుతాయన్న దృఢ విశ్వాసం నెలకొన్నాయని ఏడాది తరువాత ఇదే ఎర్రకోట బురుజు నుంచి నేను ఎంతో గట్టిగా చెప్పగలుగుతున్నాను. గత ఆగస్టు 15 నాడు నేను ‘ప్రధానమంత్రి జన్ధన్ యోజన’ పథకాన్ని ప్రకటించాను. పేదలకు లబ్ది చేకూర్చాలన్న లక్ష్యంతోనే 6 దశాబ్దాల క్రితం బ్యాంకుల జాతీయకరణ జరిగింది. కానీ, గత ఆగస్టు 15 నాటి పరిస్థితిని గమనిస్తే ఇంకా 40 శాతం మంది కనీస బ్యాంకు ఖాతా కూడా లేకుండా జీవనం సాగిస్తున్నారు. పేదలకు బ్యాంకులు స్వాగతం పలకడంలేదు. ఈ మచ్చ తొలగించాలని మేం కంకణం కట్టుకున్నాం. ఆర్థిక కార్యకలాపాల్లో అందరూ భాగస్వాములు కావాలని ప్రపంచం నినదిస్తోంది. నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉన్నప్పుడే అది సాకారం అవుతుంది. నిర్ధిష్ట సమయంలో అది మేం సాధించగలిగామని ఈరోజు నేను గర్వంగా ప్రకటిస్తున్నాను.

‘ప్రధానమంత్రి జనధన్ యోజన’ కింద 17 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. పేదల కోసమే ఈ అవకాశం కల్పిస్తున్నామని మేం చెప్పిన మాటలు విశ్వసించి ఒక్క రూపాయి లేదా ఒక్క పైసా లేనివారు కూడా ఖాతాలు తెరవాలని నేను మరోసారి అభ్యర్ధిస్తున్నాను. ఇందుకోసం బ్యాంకులకు స్టేషనరీ రూపంలో కొంత ఖర్చు కావచ్చు. కానీ, బ్యాంకులు ఉన్నది ఎవరి కోసం? నిరుపేదల కోసమే కదా! అందుకే జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవచ్చని మేం ప్రజలకు హామీ ఇచ్చాం. అయినా ప్రజలు ఎంతో దొడ్డ మనసుతో ఆ జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో 20 వేల కోట్ల రూపాయలు జమ చేశారు. నిరుపేదల్లోని ఈ మంచి స్వభావమే బలంగా టీమ్ ఇండియా మరింతగా వృద్ధి చెందుతుందని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను.

సోదర సోదరీమణులారా!! బ్యాంకులు కొత్త బ్రాంచీలు తెరవడం కష్టమైన పని కాదు. ప్రభుత్వ ఖజానా నుంచే ఆ సొమ్ము వారికి అందుతుంది. కానీ, 17 కోట్ల మందిని బ్యాంకు వద్దకు తీసుకురావడం అతిపెద్ద సవాలు. ఆ సవాలును బ్యాంకులు ఎంతో ధీటుగా అధిగమించాయి. బ్యాంకులు కూడా టీమ్ ఇండియాలో భాగమే. నిరుపేదలందరినీ ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములను చేయడం వల్ల వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందన్న ఆలోచన కొందరిలో ఉంది. దాన్ని నేను సమర్థించను. భారత్ వంటి విశాలమైన దేశంలో పిరమిడ్ తరహా అభివృద్ధి స్తూపాన్ని మనం ఊహించుకున్నట్లయితే సువిశాలమైన దిగువ వరుసే అతి పెద్దది. దళితులు, నిరాదరణకు గురవుతున్నవారు తరతరాలుగా, అణచివేతకు గురవుతున్నవారు ఈ వరుసలో ఉంటారు. ఎంత పెద్ద సుడిగాలులు వచ్చినా ఈ పిరమిడ్ తరహా వ్యవస్థ చెక్కు చెదరదు. కింది వర్గం వారి కొనుగోలు శక్తి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఆ శక్తి పెరుగుతున్నంత కాలం ఆర్థిక వ్యవస్థ పురోగమనాన్ని ఏ శక్తీ నిరోధించలేదు. అందుకే ఈ వరుసలో నిలిచినవారికే మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. నిరుపేద ప్రజల సామాజిక భద్రతకు అత్యధిక ప్రాధన్యత ఇస్తోంది.

ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన యోజన వంటి పథకాలన్నీ వారిని ఉద్దేశించినవే. దేశంలో ఇప్పటికీ కోట్లాది మంది సామాజిక భద్రత లేకుండా మనుగడ సాగిస్తున్నారు. పేద ప్రజలను పక్కన పెట్టినా, కనీసం మధ్యతరగతి వారికి కూడా బీమా అందుబాటులో లేదు. అందుకే మేం నెలకు రూపాయి పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇది మొత్తం కాదు. నెలకు ఒక్క రూపాయి అంటే సంవత్సరానికి 12 రూపాయలతోనే ఎవరైనా ప్రధానమంత్రి బీమా సురక్షా యోజనలో భాగస్వాములు కావచ్చు. కుటుంబంలో ఏ దుర్ఘటన జరిగినా 2 లక్షల రూపాయలు పరిహారంగా లభిస్తుంది. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకానికయితే రోజుకు 90 పైసలు అంటే రూపాయి కన్నా తక్కువకే ఆరోగ్య రక్షణ అందిస్తున్నాం. సంవత్సరానికి 330 రూపాయలు భరిస్తే చాలు. 2 లక్షల రూపాయల ఆరోగ్య మీకు అందుబాటులో ఉంటుంది. అది మేం సాధించి చూపించాం. సోదర సోదరీమణులారా!! గతంలో కూడా ప్రణాళికలు ఎన్నో వచ్చాయి. అసలు ప్రణాళికలు ప్రకటించని ప్రభుత్వం అంటూ ఉందా?

పథకాలను ప్రారంభించి రిబ్బన్లు కట్ చేయడంతో బాధ్యత తీరిపోదు. ఆ హామీలు నెరవేరేలా చూడాలి. 4 దశాబ్దాలు, 5 దశాబ్దాల చరిత్ర ఉన్న ఎన్నో పథకాలు కనీసం 5 నుంచి 7 కోట్ల మంది ప్రజలను చేరలేకపోయాయి. కానీ, మా ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కేవలం 100 రోజుల వ్యవధిలోనే 10 కోట్ల మందికి పైగా ప్రజలను భాగస్వాములను చేయగలిగాయి. 10 కోట్ల మంది పౌరులకు లబ్ది చేకూరడమంటే 10 కోట్ల మంది ప్రజలకు లాభం చేకూరడమే. అంటే మన దేశంలో 30 నుంచి 35 కోట్ల కుటుంబాలు ఉన్నాయని భావిస్తే 10 కోట్ల మందికి 100 రోజుల కన్నా తక్కువ రోజుల్లోనే ఈ పథకాలు అందుబాటులోకి వచ్చాయి.

ప్రభుత్వం ప్రకటించిన వివిధ పథకాలు నిర్ధిష్ట కాలపరిమితిలో అమలులోకి రావడమే టీమ్ ఇండియా సాధించిన ఘన విజయం. గత ఏడాది ప్రసంగంలో స్వచ్ఛత, మరుగుదొడ్ల నిర్మాణం గురించి నేను ప్రస్తావించాను. అప్పట్లో చాలామంది ఈయనేం... ప్రధాని…. మరుగుదొడ్ల నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు? అని ముక్కున వేలేసుకున్నారు. కానీ, ఈరోజు ప్రతి సర్వేలోను టీమ్ ఇండియా ప్రాధాన్యతే ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. స్వచ్ఛతా నినాదాన్ని ప్రజల్లో వ్యాపింపచేసేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని నేను కోరాను. సెలబ్రెటీ కావచ్చు, విద్యావేత్త కావచ్చు, ఆధ్యాత్మికవేత్త కావచ్చు, సగటు జీవి కావచ్చు.... ఈ ఉద్యమానికి చేయూత అందించినందుకు ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. ఈ ఉద్యమానికి ప్రచారకర్తలు ఎవరు? ప్రితి కుటుంబంలోనూ 5, 10, 15 సంవత్సరాల వయస్కులైన బాలబాలికలే. రోడ్డు మీద చెత్తా చెదారం పడేయవద్దని, ఉమ్మి వేయవద్దని, పర్యావరణం పరిశుభ్రంగా ఉంచాలని వారు పెద్దలకు నచ్చచెప్పారు. చిన్న వయసులోనే వారు ప్రదర్శించిన పరిణతికి నేను శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను. ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్నా కూడా అవగాహన చేసుకోలేని ఇలాంటి విషయాలు ఈ చిన్న మనసులు అవగాహన చేసుకొని, ఆచరించగలిగి ఇంత చిన్న బాలబాలికల భాగస్వామ్యం ఉన్న ఇలాంటి పథకంతో దేశం సంపూర్ణ స్వచ్ఛత సాధిస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
2019 సంవత్సరంలో మనం మహాత్ముని 150వ జయంతిని నిర్వహించుకుంటున్నాం. అప్పటికీ స్వచ్ఛ భారత్ను అందించడం కన్నామనం ఆయన అందించగల నివాళి ఏముంటుంది. ఈ దిశగా ప్రయాణం మొదలయింది. ఇది ఆగదు. టీమ్ ఇండియా స్ఫూర్తితోనే నేను గత ఆగస్టు 15న స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రారంభించాను. ప్రతి ఒక్క పాఠశాలలోనూ బాలికలకు వేరుగా మరుగుదొడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చాను. ఇది ఎవరితోనో చర్చించి ప్రకటించిన పథకం కాదు. ఆ క్షణంలో నా మనసులో మెదలిన ఆలోచన.

కానీ, అసలు పని మొదలుపెట్టేనాటికి దేశవ్యాప్తంగా 2.62 లక్షల పాఠశాలల్లో 4.25 లక్షల మరుగుదొడ్లు కావాలని అంచనాలు బయటపడ్డాయి. ఇది చాలా పెద్ద సవాలు. నేను నిర్దేశించిన ఏడాది కాల పరిమితి పొడిగించాల్సి వస్తుందనుకొన్నాం. కానీ, టీమ్ ఇండియా అనూహ్యమైన విజయం సాధించింది. పథకం పొడిగింపును వారు కోరలేదు. ఆ కలను టీమ్ ఇండియా సాకారం చేసిందని, పాఠశాలలన్నింటిలోనూ వేర్వేరు మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయని నేను త్రివర్ణ పతాక సాక్షిగా చెబుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, విధాన నిర్ణేతలు, పాఠశాల యాజమాన్యాలు అందరినీ ఈ విజయం సాధించినందుకు నేను అభినందిస్తున్నాను.


ఏ పనీ అసాధ్యం కాదు. అన్నదానికి ఈ విజయమే నిదర్శం. ఈ విజయం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మనం ఎవరికీ తక్కువకాదు అన్న భావాన్ని నెలకొల్పింది. ఆ విశ్వాసంతోనే మరిన్ని కొత్త కలలు సాకారం చేసుకొనేందుకు జాతి మరింత ముందడుగు వేస్తుంది.
సోదర సోదరీమణులారా!! మన కార్మిక శక్తి కృషిని గౌరవిస్తూ మేం ‘సత్యమేవ జయతే’ పథకాన్ని మేం తయారుచేశాం.

సూటు బూటు వేసుకున్న, పైజమా కుర్తా ధరించిన వారికే మనం గౌరవం ఇస్తాం. ఒక ఆటో రిక్షా డ్రైవరు, సాధారణ రిక్షా కార్మికుడు, న్యూస్ పేపర్ అందించే వ్యక్తి, పాలు సరఫరా చేసే వ్యక్తులకు మనం అలాంటి గౌరవం అందించం. 125 కోట్ల మంది ప్రజల మనసుల నుంచి మనం ఈ భావాలను తొలగించాల్సి ఉంది. వారంతా మనకోసం ఎంతో శ్రమిస్తున్నారు. వారంతా మనకు శ్రేయోభిలాషులు. వారి గౌరవాన్ని కాపాడటం జాతి బాధ్యత. వారు శ్రమ శక్తితో ఆర్జించిన సొమ్ము పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు చేరి 27 వేల కోట్ల రూపాయలకు చేరింది. 6 నుంచి 8 నెలలు ఒకచోట, మరికొన్నాళ్ళు మరోచోట పనులు వెతుక్కొంటూ సంచార జీవనం సాగించే ఈ కార్మిక సోదరులు 200 రూపాయల ప్రయాణ ఖర్చులు భరించలేక తమ సొమ్ము వెనక్కు తీసుకోకుండా వదిలేస్తున్నారు.

ఈ ఇబ్బందిని నివారించేందుకే ప్రత్యేక గుర్తింపుకార్డు నెంబరును ఏర్పాటుచేశాం. ఈ కార్మిక సోదరులు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ నెంబర్ వారికి శాశ్వతంగా ఉంటుంది. ఏ ఒక్కరూ ఒక్క రూపాయి కూడా మోసగించే వీలు ఉండదు. ఆ రకంగా ప్రభుత్వ ఖజానాలో మురుగుతున్న 27 వేల కోట్ల రూపాయలను వారికే తిరిగి అందించే ఏర్పాటుచేశాం. ప్రతి ఒక్క అంశానికీ ఒక చట్టం చేయడం, నిరంతరం కోర్టులను బిజీగా ఉంచడం మనకు అలవాటు అయిపోయింది. ఒకే అంశం మీద తయారయ్యే భిన్న చట్టాల మధ్య వైరుధ్యం స్పష్టంగా ఉంటుంది. దీనివల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సత్పరిపాలనకు సంకేతం కాదు. చట్టం ఏదైనా స్పష్టంగా ఉండాలి. అప్పుడే సమాజం ముందడుగు వేస్తుంది. కార్మికులను ఉద్దేశించి ప్రస్తుతం 44 చట్టాలున్నాయి. పేద కార్మికులు తమకు ఏది అన్వయిస్తుందో తెలుసుకొనే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మేం తిరగరాశాం. ఈ 44 చట్టాలను 4 చట్టాలుగా కుదించాం.

సోదర సోదరీమణులారా!! మన దేశంలో విస్తృతంగా వినిపించే మాట అవినీతి. ప్రతి ఒక్క రోగి ఆరోగ్యవంతునికి ఎలా ప్రవర్తించాలో సలహా ఇస్తూంటాడు. కానీ, తన మీద తను శ్రద్ధ పెట్టుకోడు. అవినీతి కూడా ఇలాంటి విష వలయమే. అవినీతికి పాల్పడేవారు, అవినీతికి బాధితులైనవారు ఎవరికివారు మరొకరికి సలహాలు ఇస్తూనే ఉంటారు. మొత్తం వ్యవస్థ అంతా పరస్పర సలహాల మీదనే ఆధారపడి ఉంది. దేశం మొత్తం అవినీతి రహితం కావాలని నేను ఈరోజు 125 కోట్ల మందికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా సొంత అనుభవంతో ఈ ప్రక్షాళన పై స్థాయి నుంచే ప్రారంభం కావాలని చెబుతున్నాను. మన దేశంలో అవినీతి ఒక చెద పురుగులాంటిది. కనిపించకుండా అది మొత్తం సమాజమంత�
Show Full Article
Print Article
Next Story
More Stories
ADVERTISEMENT
ADVERTISEMENTS